కాకరాపల్లి థర్మల్ మృతులకు జనసేన ఘన నివాళి

టెక్కలి, సంతబొమ్మాలి మండలం పోతినాయయుడు పేట గ్రామంలో 2011 ఫిబ్రవరి 28న జరిగిన పోలీసు కాల్పులలో మరణించిన ఉద్యమకారులకు టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కణితి కిరణ్ మాట్లాడుతూ జీవో నంబర్ 1108 ని వెంటనే రద్దు చెయ్యాలని ఉద్యమ కారుల పై అక్రమంగా బనాయించిన పోలీసు కేసులను భేషరుతుగా ఉపసమ్హరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో తన పాదయాత్రలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు నాడు టెక్కలి లో 2018 డిసెంబర్ 21న ఈ ప్రాంత పర్యటనలో ఈ ప్రాంత వాసులకు ఇదే హామీ ఇచ్చారని నేడు వారు అధికారంలోకి వచ్చి సుమారు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు హామీలు నెరవేర్చలేదని డిమాండ్ చేశారు. తమ జనసెన ప్రభుత్వం వచ్చిన వెంటనే 1108 జీవో ను రద్దు చేసి, ఉద్యమ కారులపై పెట్టిన కేసులను కూడా రద్దు చేస్తామని కణితి కిరణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన ఎంపి అభ్యర్ధి మెట్ట రామారావు మాట్లాడుతూ వచ్చే ఏడాదికి పుష్కర కాలం అవుతున్న ఈ సమస్య పరిష్కారం కాకపోవడం చాలా బాధాకరం అని ప్రభుత్వం వెంటనే స్పందించి 1108జోవో ను వెంటనే రద్దు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన నాయకులు, ఎంపీటీసీ అభ్యర్ధులు, వార్డ్ మెంబర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.