అంగడిలో సరుకులుగా ఆస్పత్రిలో ఉద్యోగాలు?

  • న్యాయం చేయాలని జనసేన పార్టీ నాయకులను ఆశ్రయించిన యువకుడు
  • అమ్మకాలు, కొనుగోలు నిరుద్యోగుల ప్రతిభకు పంచనామా
  • డా. గంగులయ్య జనసేన పార్టీ పాడేరు
  • జనసేన పార్టీ (పాడేరు) అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య

పాడేరు నియోజకవర్గం: పాడేరు కేంద్రీయ ఆస్పత్రి డ్రగ్ డీ అడిషన్ విభాగంలో డేటా ఎంట్రీ పోస్ట్ కి అప్లికేషన్ పెట్టుకుని తుది ఫలితాలలో మెరిట్ లిస్ట్ లో పేరున్న గడుగు రామ శివాజీ దొర అను వ్యక్తిని కాదని ఏ సంబంధంలేని వ్యక్తిని విధుల్లో ఎలా కొనసాగిస్తారని జనసేన పార్టీ (పాడేరు) అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య ప్రశ్నించారు. ఈ సందర్భంగా గంగులయ్య మాట్లాడుతూ ఈ నియామకాలలో పారదర్శకత లేదా? ఇటువంటి ఉద్యోగాలు అమ్మకాలు, కొనుగోలు ప్రక్రియగా మార్చేసారా?. ఆస్పత్రి పాలన సిబ్బంది ఎప్పటినుంచి ఇలాంటి పనులు చేస్తుంది?. ఇప్పటికే నిరుద్యోగుల ఆశలని నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం చిదిమేసింది. ఈ ప్రభుత్వం విధానాల కారణంగా ఎందరో గిరిజన నిరుద్యోగులు విసిగి వేసారిపోయారు. ఒకటో రెండో పడిన ఉద్యోగావకాశాలు ఇలా అవినీతికి పాల్పడి దగా చేయడం ఎంతవరకు సబబు? సాక్షాత్ జిల్లా కలెక్టర్ గారి చేత ఆదేశాలు వచ్చినా కూడా ఆస్పత్రి పాలన సిబ్బంది బేఖాతరు చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది?. సత్వరమే మెరిట్ లిస్ట్ లో ఉన్నా గడుగు రామశివాజి దొర అను నిరుద్యోగికి న్యాయం చేకూరేలా ఆస్పత్రి పాలన సిబ్బంది నిర్ణయం తీసుకోకుంటే ఈ విషయమై నియోజకవర్గం అంతటా జనసైనికులు, నిరుద్యోగులుతో పాడేరు ఆస్పత్రిని ముట్టడిస్తాం! నిరుద్యోగులతో ఆటలాడే మీ వక్రబుద్ధి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని డా. వంపూరు గంగులయ్య హెచ్చరించారు.