గుంతకల్లులో టీడీపీ నిరసన దీక్షకి జనసేన సంఘీభావం

గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు నియోజకవర్గం, గుంతకల్లు పట్టణం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యకు నిరసిస్తూ బాబుకి మద్దతుగా టిడిపి పార్టీ గుంతకల్లు నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ శాసన సభ్యులు ఆర్. జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో గత 20 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, నాయకులు పవన్ నెట్టి, అనంతపూర్ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు సోహైల్, 1వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి హెండ్రి పాల్, 31వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి తాడిపత్రి విజయ్ కుమార్, మైనారిటీ నాయకులు షేక్ జీలన్ బాషా, యువ నాయకులు మారుతీ యాదవ్, తాడిపత్రి మహేష్ కుమార్, బాలాజీ, ఇబ్రహీం, ఆర్ సి సురేష్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.