జనసేన ఆత్మీయ సమావేశం

రాజంపేట నియోజకవర్గం, వీరబల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జనసైనికులతో ఆయన మాట్లాడుతూ వైసిపి తట్టా బుట్టా సర్దుకుని దిగిపోవడానికి సిద్ధం మనం వైసిపి నాయకులను ఇంటికి సాగనంపడానికి సంసిద్ధం అసమర్ధ రాక్షస పాలనతో ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దిగిపోవడానికి సిద్ధం జనం మెచ్చే జనం కోరే జనసేన టిడిపి అధికారం అధికారంలోకి రావడానికి సంసిద్ధం ఈ ఎన్నికలలో నియోజవర్గ వ్యాప్తంగా ఓడిపోవడానికి దిగిపోవడానికి వైసిపి నాయకులు కార్యకర్తలు సిద్ధం గెలుపే లక్ష్యంగా పవనన్న మాటే శిరోధారంగా జనసైనికులంతా ఐక్యతతో సంసిద్ధం అంటూ తన ప్రసంగంతో జనసేన నాయకులు మరియు జనసైనికులకు దిశా నిర్దేశం చేసి, వారిని ఉత్తేజ పరిచి కొండంత ధైర్యంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.