డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత మెగా వైద్య శిబిరం

పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం నందు జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉచిత మెగా వైద్య శిబిరం నందు 500 పైచిలుకు ఎండపల్లి గ్రామ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు వైద్య సేవలు ఉచితంగా పొందడం జరిగింది. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు బిపి, షుగర్, ఆక్సిజన్ మొదలగు పరీక్షలు నిర్వహించి సంబంధిత వైద్యులచే జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిషన్, గైనకాలజిస్ట్, మొదలగు డాక్టర్లచే పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఉచిత సేవలు అందించడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వైద్యరంగంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉందని, ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ జగన్ ప్రభుత్వం ఉండడం దౌర్భాగ్యమని, జనసేనపార్టీ రాజకీయపార్టీగానే కాకుండా ప్రజలకు సేవచేయడంలో కూడా ముందుంటుందని జనసేనపార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలమేర వారి సేవా దృక్పథంతో ఇదివరకు అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అనేకమంది ప్రజలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరలలో భారీ ఎత్తున ఆయా పరిసర ప్రాంతాల ప్రజలు అనేక మంది ఈ ఉచితంగా మెగా వైద్య శిబిరంలోని సేవలను ఉపయోగించుకుని ఉచితంగా మందులు కూడా పొందడం జరిగింది, అదేవిధంగా ఈరోజు ఎండపల్లి గ్రామ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈ ఉచితంగా మెగా వైద్య శిబిరం ద్వారా అనేక సేవలు అందించడం జరిగింది అని ఇకమీదట ముందు ముందు కూడా అనేక ఉచిత మెడికల్ క్యాంపుల ద్వారా నియోజకవర్గంలో ఎక్కడ అవసరమైతే అక్కడ అనేక ప్రాంతాలకు వెళ్లి సేవలు అందించడం జరుగుతుందని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్, దాసరి ఉదయ్ కిరణ్, రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, మచ్చ అప్పాజీ, మురాలశెట్టి సునీల్, వెన్నపు చక్రధర రావు, మచ్చ శ్రీనివాస్, బండి వాసు బాబు, మచ్చ రాజబాబు, మచ్చా రామారావు, గొంతు రెడ్డి అనిల్, మత్స్యకార నాయకులు పల్లెటూరు బాపన్న దొర, మొరాల శెట్టి సునీల్, గరగ సత్యానంద రావు, బొజ్జ గోపికృష్ణ, మొయిల్లా నాగబాబు, రాంశెట్టి రాంబాబు, దుడ్డు రాంబాబు, వంక కొండబాబు, గేదెల వెంకటరావు, కొత్తపల్లి రాజు, పలివెల నాని, వీరబాబు, రాంశెట్టి రాంబాబు, రాంశెట్టి సింహాద్రి, మచ్చ సాయి, స్వామి రెడ్డి సాయి, స్వామి రెడ్డి కొండబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.