హైదరాబాదులో జనసేన ఆత్మీయ సమావేశం

హైదరాబాదులో నివసిస్తున్న పాలకొండ మరియు పాతపట్నం నియోజకవర్గాల జనసేన కుటుంబాల ఆత్మీయ సమావేశం

హైదరాబాదు, టికే డ్రీమ్ హోమ్స్, రాఘవేంద్ర నగర్, కర్మన్ ఘాట్, హైదరాబాద్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉత్తరాంధ్ర నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి, పాలకొండ నియోజకవర్గం నాయుకులు గర్భాన సత్తిబాబు, వీరఘట్టం మండల నాయకులు జనసేన జానీ(ఆర్కె), నెల్లిమర్ల వీరమహిళ లక్ష్మీ, విజయనగరం నాయకులు, హైదరాబాద్ లో నివాసం ఉన్నటువంటి జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి మాట్లాడుతూ నిజాయితీ గల నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని సీఎం అవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ కలిసిగట్టుగా కృషి చెయ్యాలని అన్నారు. పాలకొండ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు మాట్లాడుతూ పాతపట్నం పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరుపునుంచి ఎవ్వరు పోటీ చేసిన వారిని గెలిపించి పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ ఇవ్వాలి అన్నారు. జనసేన జానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మంచి పరిపాలన రావాలి అంటే ఒక్క పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని చెప్పడం జరిగింది.