పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన శ్రమదానం కార్యక్రమం

పెద్దాపురం నియోజకవర్గంలో ఛిద్రమైన రోడ్ల నిర్మాణానికై పెద్దాపురం నియోజక వర్గ ఇంఛార్జి శ్రీ తుమ్మల రామస్వామి(బాబు) ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తూర్పుగోదావరిజిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి గారు, జిల్లా కార్యదర్శులు, వీరమహిళలు, జనసేననాయకులు, కార్యకర్తలు, జనసైనికులందరూ తరలివచ్చి దివిలి, చంద్రమాంపల్లి గ్రామాల్లో రోడ్లకు మరమ్మతు చేసి గుంతల్ని పూడ్చి శ్రమదానం చేయడం జరిగింది మరియు దివిలి గ్రామంలో క్రీయాశీలక కార్యకర్తలకి జనసేన పార్టీ తరుపున సభ్యత్వ ఐడీ కార్డులు మరియు ఇన్సూరెన్స్ బాండ్లు అందజేయడం జరిగింది.