అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా జనసేన

అమలాపురం: రూరల్ మండలం నడిపూడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతి అయిన దొండపాటి లోవరాజు ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబాలకు అండగా జనసేన పార్టీ నాయకులు నల్లా శ్రీధర్ 5000, డిఎంఆర్ శేఖర్ 5000 మరియు నడిపూడి గ్రామ జనసైనికులు 5000 మొత్తం 15వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినారు. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ పార్లమెంటు ఇంఛార్జి డిఎంఆర్ శేఖర్ సీనియర్ నాయకులు లింగోలు పండు, కంచిపల్లి అబ్బులు, ఇసుకపట్ల రఘుబాబు, ఉప్పలగుప్తం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఆకులు సూర్యనారాయణ మూర్తి, నల్లా వెంకటేశ్వరరావు, మునిసిపల్ కౌన్సిలర్ పడాల నానాజీ, ఆర్.డి.ఎస్ ప్రసాద్, డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, చిందాడగరువు ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ, బి వెంకటేశ్వరరావు, పోలిశెట్టి బాబులు, కంకిపాటి గోపి, కరి ముళ్ళ బాబా, అరిగెల రంగప్రసాద్, అరిగెల దొరబాబు, ఆచంట అబ్బు నల్లా దుర్గారావు, నల్లా బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.