జనసేన దిమ్మ కూల్చివేతపై యుగంధర్ పొన్న ఆగ్రహం

  • నాడు ప్రజావేదికను కూల్చి ప్రజలకు దూరమైన జగన్
  • నేడు గ్రామంలో దిమ్మను కూల్చి టికెట్ కోల్పోయిన స్వామీ
  • జనసేన జెండా ఎగరేస్తాం
  • జనసేన ఇంచార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కార్వేటి నగరం మండలం, యం యం విలాసం పంచాయితి, వడ్డీ ఇండ్ల వద్ద కూడలిలో జనసైనికులు ఏర్పాటు చేసిన దిమ్మను స్టానికి మండల తహసీల్దార్ మరియు సిబ్బందితో వచ్చి కూల్చి వేశారు. అంతకుముందే విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న వడ్డీ ఇండ్లకు చేరుకొని గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహించారు. గ్రామానికి ఆనుకుని చెరువుల నున్న నిధులు నీరు రోడ్డుపై ప్రవహిస్తూ ఉండటం వలన ఇప్పటికే అనేకమంది ప్రయాణికులు పడిపోయారు. దోమల అధికమై గ్రామస్తులు ఇబ్బంది పడ సాగుతున్నారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ నాడు ప్రజావేదికను కూల్చి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దూరమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు వడ్డి ఇండ్ల గ్రామంలో దిమ్మను కూల్చి నారాయణస్వామి ఎమ్మెల్యే టికెట్ కోల్పోయారని ఎద్దేవా చేసారు. ఆ ప్రాంతంలో జనసేన జెండాను ఎగరవేయడం ఖాయమని తెలియ జేసారు. ఏది ఏమైనా ఇక మూడు నెలల మాత్రమే మీ ప్రభుత్వమని, మూడు నెలల తర్వాత జనరంజక పాలన వస్తుందని తెలిపారు. వడ్డీ ఇండ్లలో నివసిస్తున్న ప్రజలకు ఇళ్ల పట్టాలి ఇంకా మంజూరు చేయలేదని, నిత్యం రోడ్ల మీద ప్రవహిస్తున్న నీటిని పైపుల ద్వారా బయటికి పంపించలేకపోతున్నారని, కలికిరిండ్ల వద్ద ఒక వైసీపీ నాయకుడు జాతీయ రహదారి ప్రక్కన రోడ్లు భవనముల శాఖ స్థలంలో అక్రమంగా కట్టుకున్నరెండు ఇండ్లను తొలగించ లేకపోతున్నారని, అలాంటి అధికార యంత్రాంగం ఇక్కడ పనిచేస్తుందని, చేతకాని వ్యవస్థలో ప్రజలు మగ్గుతున్నారని, వైసీపీకి చరమగీతం పడాల్సిన రోజులు దగ్గరపడ్డాయని ఈ సందర్భంగా తెలిపారు. దిమ్మను తొలగించిన అధికారులు, అక్రమ కట్టడాలను, అక్రమ దిమ్మలను, అక్రమ స్థలాలను, అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను తొలగించే దమ్ముందా అని ప్రశ్నించారు. అసమర్థులైన పాలకుల మాట విని ఇబ్బందులు తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, జిల్లా సంయుక్త కార్యదర్శులు రాఘవ, నరేష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గ కార్యదర్శి అన్నామలై, మండల బీసీ సెల్ అధ్యక్షులు దేవా, యం యం విలాసం పంచాయతీ అధ్యక్షులు రుద్ర, జనసేన నాయకులు నాదముని, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.