అణగారిన వర్గాల ప్రజలకు అండగా జనసేన ఉంటుంది

  • అట్టడుగువర్గాల ప్రజల్ని సైతం మోసం చేసిన నీచుడు జగన్ రెడ్డి
  • ఓటు బ్యాంకు రాజకీయాలకు జనసేన దూరం
  • రాజ్యాధికారంలో బహుజనులకు భాగస్వామ్యమే పవన్ కళ్యాణ్ లక్ష్యం
  • బీసీ, యస్సి, ఎస్టీ, ముస్లిం గౌరవ సభలో గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు, పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. 11 వ డివిజన్ పరిధిలోని జాకీర్ హుస్సేన్ నగర్లో సోమవారం బీసీ, యస్సి, ఎస్టీ, ముస్లిం గౌరవ సభ జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఆషా ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది ముస్లిం, మైనారిటీలు, దళితులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ పేదల పక్షపాతినని తనను తాను చెప్పుకునే జగన్ రెడ్డి తన పాలనలో మాత్రం అట్టడుగువర్గాల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మైనారిటీలకు జగన్ రెడ్డి తీరని ద్రోహం చేశాడని మండిపడ్డారు. షాదీ తోఫా, రంజాన్ తోఫా నిలిపివేయటమే కాకుండా ముస్లిం విద్యార్థులకు విదేశీ విద్యను సైతం దూరం చేశాడని విమర్శించారు. ఇక దళితులకు జగన్ రెడ్డి చేసిన ద్రోహం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే మరొకరు చేయలేదని ధ్వజమెత్తారు. దళితుల సమగ్ర అభ్యున్నతి కోసం అమలవుతున్న సుమారు 27 సంక్షేమ పధకాలను ఆపేసిన దళిత ద్రోహి జగన్ అంటూ విరుచుకుపడ్డారు. దశాబ్దాలుగా పేదలను ఓటు బ్యాంకు గానే అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయని ఇటువంటి రాజకీయాలకు జనసేన దూరమన్నారు. జనసేన సిద్దాంతాల పట్ల, పవన్ కళ్యాణ్ భావజాలం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్న ప్రతీ ఒక్కరినీ జనసేన కుటుంభంలోకి ఆహ్వానిస్తున్నామని నేరేళ్ళ సురేష్ అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ ఇన్నాళ్లు అధికారానికి దూరంగా ఉన్న బహుజనులను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయటమే పవన్ కళ్యాణ్ ప్రధాన లక్ష్యమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై, బీసీలపై గతంలో ఎన్నడూ లేనివిధంగా భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగర ఉపాధ్యక్షుడు కొండూరి కిషోర్ మాట్లాడుతూ దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఘోరీ కట్టేందుకు దళిత సమాజం ఎదురుచూస్తోందన్నారు. జగన్ రెడ్డి పెదాల నుంచి మాత్రమే నా యస్సిలు, నా ఎస్టీలు అనే మాట వస్తుందని ఆయన గుండెల్లో రెడ్లకు తప్ప మరొకరికి చోటు లేదని కిషోర్ దుయ్యబట్టారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గుండ్రేడ్డి అనిల్, రాష్ట్ర కార్మిక సంఘ నేత సోమి శంకరరావు, నగర ఉపాధ్యక్షుడు చింతా రాజు, ఉపాధ్యక్షులు యడ్ల నాగ మల్లేశ్వరరావు, ఆనంద్ సాగర్, కోటి, కార్తిక్, సింగ్, అయుబ్ ఖాన్, రెల్లి యువ నేత సోమి ఉదయ్, బాషా, కరీముల్లా, మహంకాళి, నవీన్, రోశయ్య, దుర్గాప్రసాద్, రజాక్, గోపి తదితరులు పాల్గొన్నారు.