ఆపదలో ఉన్న జనసైనికులకు జనసేన అండ

గురజాల, పిడుగురాళ్ళ మండలం, జానపాడు గ్రామంలో ఇటీవల కొమ్మెర శ్రీహరి బైక్ యాక్సిడెంట్ లో కాలుకి దెబ్బ తగలడం జరిగింది. విషయం తెలుసుకొన్న జనసేన నాయకులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కొమ్మర శ్రీహరికి జానపాడు గ్రామం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 10500/-రూపాయలు అదేవిదంగా ఇటీవల మరణించిన తోట వెంకటేశ్వర్లు కుటుంబానికి 5000/ రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోయి క్రియాశీలక సభ్యునికి అందించే ఇన్సూరెన్స్ కూడా త్వరగా అందేలా కృషి చేస్తామని, పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ.. ఆపదలో ఉన్న జనసైనికులకు అండగా ఎప్పుడు జనసేన పార్టీ ఉంటుందని.. ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఆవుల రమేష్ మరియు అంబటి సాయికుమార్ లను పార్టీ నాయకులు ఖాసీం సైదా అభినందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ దూదేకుల కాసిం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం, పిడుగురాళ్ల మండల ప్రధాన కార్యదర్శి అవుల రమేష్, అంబటి సాయి కుమార్, అనపర్తి నాగేశ్వరరావు, బేతంచెర్ల ప్రసాద్ సాంబశివరావు, వెంకటేష్, నరసింహారావు, గణేష్, పూర్ణ, బుజ్జి, తిరుమల రావు, యతి రాజుల కొండ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.