కందరాడ గ్రామంలో దివ్యాంగునికి ఆసరాగా నిలచిన జనసేన

పిఠాపురం: ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీమతి చల్లా లక్ష్మీ మట్టాడ సోమరాజు మట్టాడ శ్రీనుబాబు, మహేష్ ల అభ్యర్థన మేరకు, పిఠాపురం నియోజకవర్గ కందరాడ గ్రామ కాపురస్తుడైన బండి సత్తిబాబు అనే దివ్యాంగునికి తదేకం ఫౌండేషన్ సౌజన్యంతో ట్రై సైకిల్ అందించడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష సమక్షంలో, కందరాడ జనసేన పార్టీ ఎంపీటీసీ పిల్లా సూర్యనారాయణ సునీతమ్మల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు ఊట ఆదివిష్ణు (నానిబాబు), మురాలశెట్టి సునీల్ కుమార్ పాలుపంచుకోగా, గొల్లప్రోలు మండల నాయకులు మర్రి దొరబాబు, గొల్లపల్లి వీరబాబు, మొయిళ్ళ నాగబాబు, పిఠాపురం మండలనాయకులు పిల్లా వెంకటదినేష్, వాకపల్లి సూర్యప్రకాశ్ గార్లు మరియు స్థానిక జనసైనికులు పోతుల రాజు, మట్టాడ ముసలయ్య, మట్టాడ వీరబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాధితునికి అండగా నిలిచారు..