రాజోలు కరకట్ట ప్రాంత వాసులకు ఇచ్చిన హామీలు వైసీపీ ప్రభుత్వం నెరవేర్చాలి: బొంతు రాజేశ్వరరావు

  • కరకట్ట పటిష్టం కోసం ఇప్పటి వరకు విడుదల చేసిన కోట్ల రూపాయల నిధుల లెక్క తేల్చాలి!.
  • జాలరుల క్రాప్ హాలిడే లో ఇస్తాను అన్న పదివేల రూపాయల హామీ, పచ్చ పార్టీ నాయకులు సూచించిన వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నవారికేనా?

రాజోలు, కోనసీమగా పేరు గాంచిన రాజోలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు తలమానికం. అలాంటి రాజోలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కారణం రాజకీయ పార్టీల సొంత ప్రయోజనాలకోసం మాత్రమే ఇక్కడి ప్రజలని మభ్యపెడుతూ వారిని ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు, గత ప్రభుత్వాలు కరకట్ట అభివృద్ధి కోసం విడుదల చేసిన కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు, మేకలపలెం సమీపంలో గత వరదల కారణంగా కరకట్ట తెగిపోయే పరిస్థితికి వస్తే ఆ సమయంలో అధికారులు కుడా చేతులు ఎత్తిస్తే స్థానికులు తెల్లవారు కాపలా కాసి ఇసుక మూటలు వేసి వరద ఉదృతి తగ్గుముఖం పట్టేక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత 2022 జూలై నెలలో 26 తేదీన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వరద ముంపు ప్రాంతాలను హుటాహుటిన సుడిగాలిలా పర్యటించి, మేకలపాలెం మరియు రాజోలు నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చారు కానీ అమలుచేయడం మరిచారు. రాజోలు కరకట్ట తెగి ప్రమాదం జరిగితే సుమారు 36 గ్రామాలకు తీవ్ర నష్టం, వేల ఏకరాల పంట నష్టం, ప్రాణనష్టం, కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది అని ఆయన అన్నారు. ప్రమాదం పొంచి ఉందని తెలిసికూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ప్రభుత్వా వైఫల్యాలను నిలదీస్తూ రాజోలు తాలూకా ప్రజలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కట్ట మీద నివసిస్తున్న వారికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి స్థలాలు ఇవ్వటం మరిచారు అని అన్నారు. కొందరికి ఇచ్చిన ఇళ్ళ స్థలాలను సరైన దారి మార్గం కుడా కల్పించలేని పరిస్థతుల్లో ప్రభుత్వం ఉంది అని ఆయన అన్నారు. జాలరులకు వేట లేని సమయంలో పడవకు పది వేల రూపాయలు ఇస్తాము అని స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అప్పటి వరదలో కొట్టుకు పోయయా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజోలు నియోజక వర్గంలో ప్రజల సమస్యలు తీర్చే వరకు జనసేన పోరాటం చేస్తోంది అని ఆయన హెచ్చరించారు. మరియు పార్టీ బలోపేతం కోసం అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరచడం లో రాజోలు నియోజకవర్గం ముందు ఉంటుందని ఆయన అన్నారు. అందులో భాగంగా ఆదివారం గూడపల్లి నుంచి చేరికలు మొదలు పెట్టాము అని ఆయన మీడియాకి తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రేఖపల్లి సురేష్ బాబు, కుంచే శ్రీనివాస్, గుర్లింక బ్రహ్మానందం, మేకల ఏసుబబు, విప్పర్తి సాయిబాబు, అడబాల సిరి, బడుగు శ్రీను, సుందరం బ్రహ్మయ్య, మంగపల్లి గదా, బాబీనాయుడు, గుర్లింక గంగాధరం, దారపురెడ్డి బాబ్జీ మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.