గుంటూరులో జనసేన, టిడిపి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

గుంటూరు: జనసేన మరియు టిడిపి పార్టీ గుంటూరు 12వ డివిజన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా అహ్మద్ నగర్ ఫస్ట్ లైన్ నందు మరియు లాలాపేట చిన్న బజార్ గాంధీ బొమ్మ వద్ద గుంటూరు టీడీపీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మహమ్మద్ నసీర్ చేతుల మీదగా త్రివర్ణ పతాకం ఎగరవేయడం మరియు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేయటం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ.. స్వతంత్ర భారతావనికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది జాతీ పండగ.. జాతీయ పండగ.. భారత రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలనే దృఢ సంకల్పంతో ప్రపంచంలోనే అతిపెద్దదైన “రాజ్యాంగాన్ని” రూపకల్పన చేసి భరతజాతికి అంకితమిచ్చిన రోజు. నేటి స్వేచ్చా భారతానికి కారణం ఆనాటి మహనీయుల ‘రాజ్యంగా నిర్మానమే’ అలాంటి రాజ్యంగ నిర్మాణానికి సహకరించిన మహనీయులను తలుచుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదె. దుర్గాప్రసాద్ 12వ డివిజన్ టిడిపి పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ సలీం, టిడిపి కార్పోరేటర్ అశోక్, ఇక్బాల్, మురళి, జనసేన పార్టీ సెక్రటరీలు మల్లెల శివ, గుంటూరు శివ సుందర్ కుమార్, హఫీజ్, బద్రి, ఫరీద్, రహీం, వినయ్, భాస్కర్, మణికంఠ, మహావీర్, చంటి, ప్రతాప్, జహీర్, ఖాసిం, షఫీ, రషీద్, యాసిన్, పలువురు జనసేన, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.