ప్రమాదంలో కాలుని కొల్పొయిన రాజ్యం కు అండగా నిలచిన జనసేన

బోనకల్ మండలం, చిరునోముల గ్రామానికి చెందిన రాజ్యం చిన్న ప్రమాదంలో తన కుడి కాలుని పోగొట్టుకోవడం జరిగింది, ప్లాస్టిక్ కాలు కోసం ప్రయత్నించగా కుటుంబ ఆర్ధిక పరిస్థితి బాగోలేక తీసుకోలేక పోయారు, ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ బోనకల్ మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ జానీపాషా స్వయంగా వారి ఇంటికి వెళ్లి సమస్య తెలుసుకొని మరల రెండు కాళ్ళతో నడిపిస్తానని భరోసా ఇచ్చి, విజయనగరానికి చెందిన గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించగా వారు వెంటనే స్పందించి ఉచితంగా ప్లాస్టిక్ కాలిని అందించడం జరిగింది. అది చూసి కుటుంబం అంత సంతోషం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ బొనకల్ మండల ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ జానీ పాషా మాట్లాడుతూ బోనకల్ జనసేన పార్టీ మరియు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ అన్ని వేళల, కష్టాల్లో తోడుగా ఉంటారని తెలియజేసారు.