ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన

తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ హల్కన్ టైమ్స్ క్లబ్ లో జరిగిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అధ్యక్షతన జరిగిన పాత్రికేయ సమావేశంలో పాత్రికేయ సమావేశంలో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి పై ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుని ఖండించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీ… మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి తన సొంత ఖజానా నింపుకునే పనిలో ఉన్న సీఎం పాదయాత్రలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేయకుండా పిఆర్సి అర్ధాన్నే మార్చివేశారు. ఉద్యోగుల కాలపరిమితి పెంచమని వారు ఏనాడూ అడగలేదు. పదవి విరమణ పొందిన వారికి 20 లక్షల నుండి 70 లక్షల వరకు పేమెంట్స్ చేయాలి. దాని నుండి తప్పిన్చుకోవడానికి ఈ పెంపు.. దీనివల్ల నిరుద్యోగ యువత తమ అవకాశాలని పోగుట్టుకుంటారు. 7 డిఏలు బాకీ ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. ఈ ప్రభుత్వనీకె అఘనత దక్కింది. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించలేదు.. తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుండి వైసీపీ నాయకులకు ఉద్యోగులని రెచ్చకొట్టే విధంగా సూచనలు ఇవ్వడం చాలా దారుణం. భవిష్యత్లో ఉద్యోగులు చేపట్టబోయే న్యాయబద్ధమైన ఉద్యమానికి మావంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల ఇంచార్జులు శెట్టిబత్తుల రాజబాబు, అను శ్రీ సత్యనారాయణ, మాకినీడి శేషుకుమారి, పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు తాటికాయల వీరబాబు, గంగాధర్, వాసిరెడ్డి శివ, బండారు మురళి, బోగిరెడ్డి కొండబాబు, అట్లా సత్యనారాయణ, గణేష్ నాయుడు, జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, జిల్లా కమిటీ సభ్యులు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.