నూజివీడు మునిసిపల్ ఏఈ కి వినతిపత్రం ఇచ్చిన జనసేన

*జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎం.ఆర్.అప్పారావు కాలనీలో పగిలిన వాటర్ పైప్ లైన్ వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతూ మునిసిపల్ ఏఈ కి వినతిపత్రం

  • రెండు రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని ఆఏ హామీ..

నూజివీడు, టౌన్లోని ఒకటవ వార్డ్ ఎం.ఆర్.అప్పారావు కాలనీలో పగిలిన వాటర్ పైప్ లైన్ వెంటనే మరమ్మతులు చేపట్టాలనీ నూజివీడు టౌన్ జనసేనపార్టీ నాయకులు ముత్యాల .కామేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం ఒకటవ వార్డ్ స్థానికులు మరియు టౌన్ జన సైనికులతో కలిసి సెంటున్నర ఒకటో రోడ్డు వద్ద పైప్ లైన్ పగిలి వాటర్ పోతు ప్రజలు ఇబ్బంది పెడుతున్న సమస్య పై నూజివీడు టౌన్లోని ఒకటవ వార్డ్ ఎం.ఆర్.అప్పారావు కాలనీలో పగిలిన వాటర్ పైప్ లైన్ వెంటనే మరమ్మతులు చేపట్టాలనీ నూజీవీడు జనసేన నాయకులు మరియు జనసైనికులు మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో కాలనీ వాసి మరియు సమస్య బాధితులలో ఒక్కరైన దిలీప్ చేత సమస్యను వివరించారు. మునిసిపల్ ఏఈ ని కలవగా రెండు రోజులో సమస్యను పరస్కిస్తాము అని హామీ ఇచ్చినారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ… 4 నెలలు గా కాలనీకి వచ్చే కృష్ణ వాటర్ పైప్ లైన్ పగిలి నీరు పోతుంటే స్థానిక కౌన్సిలర్, నూజివీడు మునిసిపల్ సిబ్బంది పట్టించుకోకుండా ఉండటం బాధాకరమన్నారు. స్థానిక ప్రజలు సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకు వెళితే ప్రజలు తలో 500 వేసుకొని పైప్ లైన్ మరమ్మతులు చేయించుకోవాలని ఉచిత సలహా ఇవ్వటం బాధ్యత రాహిత్య నిదర్శనమన్నారు. ప్రజలు నాలుగు నెలలుగా బురదమయం అయిన ఆ రోడ్లో నడవలేక ఇబ్బందులు పడుతున్న ప్రజాప్రతినిధి, అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడం పేదలు నివసించే ప్రాంతాలపై మీకున్న పక్షపాత వైఖరి తెలియజేస్తున్నారు. వెంటనే పైప్ లైన్ మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నూజీవీడు జనసేన నాయకులు ముత్యాల కామేష్, మమ్మల్నెని సునీల్ కుమార్, ఏనుగుల చక్రి, యూ స్మార్ట్ ఉమా , చేన్నా మరియు ఎం.ఆర్.అప్పారావు కాలనీ జనసేన నాయకులు శ్రీకాంత్, గిరి, దినేష్, సాయి, మణికంఠ, అలీ భాష, మహేష్, వెంకటేష్, గోపి తదితరులు పాల్గొన్నారు.