తెలుగుదేశం దీక్షకి జనసేన మద్దతు

శింగనమల నియోజకవర్గం: నార్పల మండల జనసేన పార్టీ మండల కన్వీనర్ గంజికుంట అధ్యక్షతన మండల నాయకులు తుపాకుల భాస్కర్, పొన్నతోట రామయ్యల ఆధ్వర్యంలో, జనసైనికులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలపడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసేన మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ మాట్లాడుతూ చంద్ర బాబు నాయుడు ఆరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కక్షే అన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా హడావిడిగా ఆరెస్ట్ చేయవలసిన పనేముందని ప్రశ్నించారు. సరైన ఆధారాలు కోర్ట్ కి సమర్పించకుండా తాస్కారం చేస్తూ రిమాండ్ గడువు పెంచాలని పలుమార్లు కోరడం, హైకోర్టు చంద్రబాబు నాయుడు ఆరెస్ట్ కి సెక్షన్ 17 ఆ వర్తించదు అని తీర్పు ఇచ్చిన సిఐడి సుప్రీం కోర్టుకు వెళ్లడాన్ని చుస్తే వైసీపీ నాయకులకు న్యాయ వ్యవస్థపై సరైన ఆవగాహన లేదని విమర్శించారు. కేవలం ఒక నీచమైన దురుద్దేశం తోనే తెలుగు దేశం అధినేతని ఆరెస్ట్ చేసారన్నారు. మండల నాయకులు తుపాకుల భాస్కర్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ న్యాయం వైపే నిలబడ్డాడన్నారు. వైసీపీ నాయకులు అధికార మదంతో రాష్టాన్ని నాశనం చేశారన్నారు. తెలుగుదేశం, జనసేన ఇద్దరు కలసి నియంత పాలకుల్ని గద్దె దించేలా సమిష్టిగా పనిచేద్దమని పిలుపునిచ్చారు. జనసేన నాయకులు, టిడిపి కార్యకర్తలతో మమేకమై వారికి మద్దతు తెలుపుతూ, అన్యాయం జరిగినప్పుడు బాధితులకు అండగా జనసేన పార్టీ ఎప్పుడు వెన్నంటే ఉంటుందని న్యాయంజరిగే వరకు మనమందరం కలిసి పోరాడి నియంత ప్రభుత్వాన్ని దించి జనసేన- తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజలను దుష్ట పాలననుండి విముక్తి కల్పిద్దామని జనసేన పార్టీ తరపున టిడిపి నాయకులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్, పొన్న తోట రామయ్య, షేక్ రహంతుల్లా, సంగాఅశోక్, బాబా ఆలీ, నడిమి దొడ్డి అశ్వర్థ రెడ్డి, దాడి తోట శివయ్య, సుభహాన్, రమణయ్య, ఉప్పు రాము, వినోదంలోకేష్, సాకే రాజు, శ్రీధర్ బాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు.