అంగన్వాడి టీచర్లకు జనసేన మద్దతు: శివరామ ప్రసాద్

అంగన్వాడీ సమస్యలు తీర్చాలని ప్రభుత్వంపై వారు చేస్తున్న ఆందోళనకు, డిమాండ్లకు, చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ మద్దతు తెలియజేస్తుందని ఉమ్మడి ప్రకాశం జిల్లా, జనసేన కార్యదర్శి గూడూరు శివరామ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 25వేల రూపాయలు ఇవ్వాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వారు చేస్తున్న ఆందోళనకు జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడీలను ప్రభుత్వంలోని అన్ని రకాల సేవలకు వారిని వినియోగించుకుంటూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం శోచనీయమని ఈ చర్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వారు చేస్తున్న న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని లేనిపక్షంలో వారి ఆందోళనకు జనసేన కూడా భాగస్వామ్యం అవుతుందని, ఈ విషయాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి దృష్టికికూడా తీసుకువెళ్లామని, జనసేన పార్టీ కూడా వారి ఆందోళనలో భాగస్వాములు అవుతామని, చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ తెలియజేసుకుంటుందని, జనసేన తరఫున శివరామ ప్రసాద్ తెలియజేసారు.