Nuzvid: దగ్గరుండి పొలం దున్నించిన జనసేన నాయకులు

నుజీవీడు నియోజకవర్గం చాట్రాయి మండలం భూరగగుడెం రైతు శ్రీమన్నారాయణ పొలంలోకి 3 సంవత్సరాలుగా రహదారి నుండి వెళ్లనీయని వైఎస్సార్సీపీ మండల నాయకుల దౌర్జన్యాన్ని అరాచకాలను నిరసిస్తూ గత కొద్ది రోజులుగా జనసేన పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే… అయితే ఈరోజు మంగళవారం చాట్రాయి మండలం తాసిల్దార్ CH. విశ్వనాథరావు, సబ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు VRO సునీత, ఋఈ అమీన్, RI స్వరూప, కానిస్టేబుల్ గిరిబాబు పర్యవేక్షణలో రహదారి నుండి తీసుకెళ్లి పొలం దున్నించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నూజివీడు నియోజకవర్గం నాయకులు మరీదు, శివరామకృష్ణ, చాట్రాయి మండలం నాయకులు తుమ్మల జగన్, ఆరెల్లి కృష్ణ, రైతు వెల్లంకి శ్రీమన్నారాయణ, వెల్లంకి రవి, వెల్లంకి వెంకట సుబ్బారావు, వెల్లంకి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.