Vijayawada: పిచ్చెక్కి మాట్లాడుతున్న మంత్రులును ఎర్రగడ్డలో చేర్పించాలి

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చెయ్యొద్దని నిర్వహించిన సభలో శ్రీ పవన్ కళ్యాణ్ కి వచ్చిన లక్షలాది మంది ప్రజా మద్దతు చూసి వైఎస్ఆర్సిపి నాయకులకు మైండ్ బ్లాక్ అయి వెన్నులో వణుకు పుట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.
విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయొద్దని అఖిలపక్షం ఏర్పాటు చేయకపోతే సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లే. మంత్రి కొడాలి నాని గతంలో ఉత్తరకుమారుడి లాగా ప్రగల్భాలు పలికారు, విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తాం అన్నారు నేడు మాట తప్పారు. వైఎస్ఆర్సిపికి ప్రజల్లో ఆదరణ తగ్గిపోయింది ఈ పార్టీ వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది రాబోయే ఎన్నికల్లో ఘోర పరాభవం తధ్యం. పిచ్చెక్కి మాట్లాడుతున్న మంత్రులును ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి లో చేర్పించాలి అని అన్నారు.