జమ్మిగడ్డ స్మశానవాటిక ధర్నాకు జనసేన మద్దతు: రాష్ట్ర వీరమహిళా విభాగం వైస్ చైర్ పర్సన్ నీహారిక

ఎంత బ్రతుకు బ్రతికిన ఎవ్వరికైనా చివరి మజిలీ స్మశాన వాటిక అని మరిచిపోయి ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి గత 30 సంవత్సరాలుగా జమ్మిగడ్డ ప్రజలను ఓట్ల కోసమే వాడుకుంటూ, కనీసం స్మశాన వాటిక కూడా ఏ పాలకులు ఏర్పాటు చేయలేదు. అక్కడ స్మశాన వాటిక కోసం బుధవారం మేడ్చల్ మల్కాజ్ గిరి కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష ధర్నా కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ చేపట్టగా జనసేన పార్టీ తరుపున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వీరమహిళా విభాగం వైస్ చైర్ పర్సన్ నీహారిక, ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కమిటీ సభ్యులు రామంజనేయులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ భారత్ & చర్లపల్లి కమిటీ అధ్యక్షులు శివ కార్తిక్, ఉపాదక్షులు దేవేందర్, ప్రధాన కార్యదర్శి సూర్య తోరం, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ మరియు జనసైనికులు శివ, అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.