రాజోలు నియోజకవర్గంలో టిడిపి నిరాహారదీక్షకు జనసేన మద్దతు

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ రాజోలు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో చేస్తున్న నిరసనకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున జనసేన పార్టీ సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్ ఆధ్వర్యంలో రాజోలు మహాత్మా గాంధీ, వంగవీటి రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి అక్కడి నుండి జనసేన నాయకులు, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, నాయకులు, వీరమహిళలు, జనసైనికులు కలిసి ర్యాలీగా నడుచుకొని దీక్ష శిబిరం వద్దకు చేరుకొని టిడిపి నాయకులకు సంఘీభావం తెలియచేయడం జరిగింది.