హుకుంపేటలో టీడీపీ నిరసనకు జనసేన మద్దతు

పాడేరు నియోజకవర్గం: హుకుంపేట తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అరెస్ట్ కి నిరసనగా గత కొన్ని రోజులనుంచి అరకు నియోజకవర్గంలో పార్టీ నాయకులు సీనియర్ కార్యకర్తలు హుకుంపేట నిరసన శిబిరాలలో నిరసనలు చేస్తున్నారు. అందుకు మద్దతుగా హుకుంపేట మండల జనసేన నేత బలిజ కోటేశ్వరరావు 50 మంది జనసైనికులతో వెళ్లి తెదేపా నిరసన శిబిరానికి చేరుకుని తెదేపా పార్టీ సీనియర్ నాయకులతో యువ నాయకులు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ గారితో కలిసి నిరసనకు తమవంతు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా బలిజ కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విధానాలను, విలువలను మంటగలిపేల చెయ్యడానికి ప్రజాస్వామ్య పద్ధతికి రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలనే ఒక ఆర్థిక నేరస్తుడు అధికారాన్ని ఉపయోగించడం ఇక్కడ ప్రజలు ఆలోసించదగ్గవిసయం అది ఒక బెయిల్ మీద ఉన్నా వ్యక్తి కనుసన్నల్లో జరగడం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత ఎన్నికల్లో ఎంత తప్పిదం చేశారో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే చూసే వాళ్ళకి ఈ సందర్బంగా జనసేనపార్టీ తరుపున జనసైనికులు గా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. అతను గొప్ప సంపద సృష్టి చేసిన ప్రప్రథమ దక్షిణ భారతదేశానికి చెందిన నాయకుడు.ఐటి హబ్ దక్షిణ భారత దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైబరాబాద్ ని సృష్టించిన విజనరీ. ప్రపంచ కుబేరులను, యునైటెడ్ స్టేట్స్ నాయకత్వాన్ని మెప్పించి ఇన్వెస్ట్ మెంట్స్ కి సిద్ధం చేసి సంపద సృష్టి చేసిన గొప్పనాయకులు. బండెడు కేసులున్న వ్యక్తులు ప్రతి శుక్రవారం కోర్టులో హాజరు వేసుకునే వ్యక్తులు ప్రజలు కనికరిస్తే అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏం సాధారణంగా తమ సహజ బుద్ది తో ఏమి చేస్తారు?సహజంగా రాజకీయ కక్ష్య సాదింపే చేస్తారు ఇంకా చేయాలనే కుటిల ప్రయత్నాలు, కుట్రలు చేస్తారు. ఇటువంటి వైసీపీ రాజకీయాలని గిరిజన ప్రజలు నమ్ముతున్నంత కాలం గిరిజనాభివృద్ధి కాంక్షించడం అత్యాశే అవుతుంది. బెయిల్ రద్దు అయితే వారి పరిస్థితి ఏమిటో వాళ్ళకే అర్థం కాని నేరస్తులకు అధికారం ఇస్తే నేరప్రవుత్తి సాటుకోక ఇంకేమి చేస్తారు. అప్పులు చేసినంత ఈజీ కాదు అభివృద్ధి చేయడం. అధికారదుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టడమే తెలుస్తుంది తప్పితే సంపద సృష్టిపై వీళ్లకి ఏ ఆలోచన ఉండదనే విషయం ప్రజలు తెలుసుకోవాలి. ఈ ఆర్థిక ఉగ్రవాదికి ఏమి తెలుసంటూ తీవ్ర విమర్శలు చేసారు. తెదేపా నాయకులకు మా మద్దతు ఉంటుంది రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తు చేసి మేమంటే ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ సందర్బంగా 50 మంది జనసైనికులతో కలిసి తెదేపా నాయకులతో నిరసన శిబిరంలో పాల్గొని వారికి తమవంతు మద్దతు తెలిపారు.