ఆచంటలో టిడిపి రిలే నిరాహార దీక్షకు జనసేన మద్దతు

ఆచంట నియోజకవర్గం: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా ఆచంటలో తలపెట్టిన తెలుగుదేశం పార్టీ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొనడానికి పెనుగొండ మండల జనసేన నాయకులు మరియు పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య, జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి రావి హరీష్, మరియు పెనుగొండ జనసేన ఎంపీటీసీ మేక చంద్రకుమారీ, పెనుగొండ మండల నాయకులు మరియు గ్రామాల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొని జనసేన తెలుగుదేశానికి అండగా నిలుస్తుందని రానున్న రోజుల్లో వైకాపా అంతం చేసే విధంగా కలిసి పోరాటం చేద్దామని అక్కడ తెలుగుదేశం నాయకులతో వారు చెప్పడం జరిగింది. అలాగే వారు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కొరకు అలాగే ప్రజా శ్రేయస్సు వరకు తీసుకున్నారని తెలుగుదేశం జనసేన కలయిక చూసి వైసిపికి ఓటమి భయం పట్టుకుందని దాంతో వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకి అర్థం కావట్లేదని పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీసులో చెప్పిన విధంగా ఎక్కడైనా ఆసుపత్రిలో వారు చూపించుకుంటే మంచిదని వారు జనసేన నాయకులు చెప్పడం జరిగింది.