మత్స్యకారుల ఆందోళనకు జనసేన మద్దతు

కాకినాడ సిటి: చమురు కంపెనీల ఆంక్షల కారణంగా స్థానిక మత్స్యకారుల వేటలో జరుగుతున్న నష్టానికి చమురు కంపెనీలు ఇస్తున్న నష్టపరిహారంలో జరుగుతున్న విషయాలపై చేస్తున్న ఆందోళనా శిబిరాన్ని ముత్తా శశిధర్ సందర్శించి తనమద్దతుని ప్రకటించారు.
ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఈసమస్య గత పదిహేను సంవత్సరాలగా నలుగుతోందనీ అలాగే మోసపోతున్నామన్నారు. ఈ ప్రాంతంలో చమురు కనుగొన్న 2009 సంవత్సరం నుండీ తదనంతరం జరిగిన పరిణామాల్లో ఇక్కడున్న మత్స్యకారులకి అన్యాయం జరిగిందన్నారు. ఇది ప్రభుత్వం ద్వారా ఉత్పన్నమైన సమస్యగానీ, ప్రభుత్వంపై భారం పడే సమస్య అంతకన్నా కాదనీ, ఒక ప్రభుత్వ సంస్థ మరొక ప్రయివేటు సంస్థ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ సి.ఎస్.ఆర్ నిధులలోని ఇచ్చే డబ్బుతప్ప మరేదీ కాదన్నారు దీనివల్ల ప్రభుత్వం మీద భారం పడే సంఘటన అసలేకాదన్నారు. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ నాయకులుకానీ ఎందుకు వీటిపై మాట్లాడరని సూటిగా ప్రశ్నించారు. ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ సి.ఎస్.ఆర్ నిధులనుండీ ఏవో కొద్దిమొత్తంలో కేటాయించి వేలాదిమంది మత్స్యకారులని నష్టపరుస్తున్నారన్నరు. మనం ఈరోజు ఏటిమొగలో చూస్తే వేటకు వెళ్ళలేని స్థితిలో మత్స్యకరులు ఉన్నారనీ, దుమ్ములపేటలో చూస్తే స్థానిక మత్స్యకారులు కులవృత్తిని వదలి పెయింటింగ్ వృత్తికి కొందరు, ఆటో ద్రైవర్లుగా కొంతమంది మారి జీవనం భారంగా సాగిస్తున్నారన్నారు. దీనికి ప్రాధమిక కారణం పడవలపై వేటకి వెళ్ళెలేని పరిస్థితి, వెళ్ళినా రిగ్గుల దరిదాపులలోకి కూడా వెళ్ళనీయకుండా చేయడం, వారి వలలను కోసేయడం లాంటి చర్యలతో నష్టపరుస్తునారు మళ్ళీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దీనిని పూర్తిగా జనసేనపార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈసమస్యని పరిష్కరించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వొత్తిడి తీసుకురావలనీ అందుకు చిత్తశుద్ధి ఉండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పరిసర ప్రాంత మత్స్యకారులకు న్యాయంకై పోరాడవలసిన బాధ్యత ప్రతివొక్కరిపై ఉందనీ ఇది వాల్లు చేయలేదనీ కానీ జనసేనపార్టీ వీరికి పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారిని గత కొన్ని నెలలు క్రితం ఆయన పర్యటనలో ఏటిమొగలోకి తాను తీసుకువచ్చిన విషయాన్ని ఈసందర్భంగా ముత్తా శశిధర్ గుర్తుచేసారు. గత పదిహేను సంవత్సరాలుగా ఏరాజకీయ పార్టీ అధ్యక్షుడూ పర్యటించలేదు అనీ కానీ తాను తీసుకువచ్చానన్నారు. ఆసందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి స్థానిక మత్స్యకారులు పరిస్థితులు వివరించారనీ, మొన్న డిసెంబరులో కూడా విషయాన్ని ఆయనకి చెప్పరనీ 25 మంది ఎం.పిలు, 151 మంది ఎం.ఎల్.ఏలు ఉన్న అధికారపార్టీకూడా నిర్లక్ష్యం చేసిందనీ, ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత పదిరోజుల క్రితం లేని ప్రేమ ఒలకబోస్తూ మీ పోరాటానికి మద్దతు ప్రకటించడం కేవలం మొసలి కన్నీరు మాత్రమే అనీ, లేదంటే మూడు నెలలక్రితం మీరంతా ధర్నా చేసి కలక్టరు గారికి వినతిపత్రం ఇచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దీనిని రాజకీయాలకు అతీతంగా చూసి పోరాటం చేయాలనీ, అందుకు జనసేనపార్టీ ముందుంటుందని తెలియచేసారు. కాకినాడలోనే అత్యధికంగా మత్స్యకారులు నీష్టపోయారనీ వీరితోపాతూ పరిసర ప్రాంత మత్స్యకారులు కూడా నష్టపోయారనీ, వీరందరికీ న్యాయం జరగాలని అందుకు జనసేనపార్టీ పూర్తి మద్దతు తెలియచేస్తొనదన్నరు. అవసరమైతే స్పందనలో అందరమూ వందలాదిగా ఫిర్యాదులు చేద్దామనీ ఎం.పిలపై వొత్తిడి తెద్దామనీ పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. పోరాడి గతంలో పోయినదానిని కూడా సాధించుకుందామని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు కాటాడి సత్యన్నారాయణ, కామాడి సుబ్బారావు, కొల్లు ప్రసాద్, పట్టా ఆదినారాయణ, కరి బూరయ్య, కాటాడి మల్లికార్జునరావు, ఓలేటి నూకరాజు, పాలెపు నూకరాజు, వరిపల్లి బలరాం, కటాడి ఆదినారాయణ, కర్రి సువర్ణరాజు, సిటి ఆర్గనైజింగ్ శెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, మొసా ఏసేబు, బర్రే అప్పారావు తదితరులు పాల్గొన్నారు.