చిన్నగంజాంలో ఇంటింటికి జనసేన

పర్చూరు, చిన్నగంజాం మండలం, చిన్నగంజాం గ్రామంలోని ప్రభుదేవా కాలనీలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు సందు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇంటింటికి పర్యటించడం జరిగింది. ఈ పర్యటన క్రమంలో స్థానిక మహిళలు సమస్యల్ని జనసేన నాయకులు దృష్టి తీసుకొచ్చారు ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని జనసేన నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు కురి వాసు, అడుసుమల్లి హరిబాబు, పెద్ద శింగు వెంకటేష్, మండల ఉపాధ్యక్షులు మాచవరపు అంకయ్య, ఉమ్మడి ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి ఇంతియాజు జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ నెంబర్ తుమ్మలపెంట సతీష్, జనసేన వీర మహిళ గున్నమనేని విజయశాంతి యువ నాయకులు తోట అశోక్ చక్రవర్తి, గంటా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.