Nellore: ప్రచారంలో దూసుకెళుతున్న పసుపులేటి రజని

15వ డివిజన్ లో జనం నీరాజనం

అందరికీ సుపరిచితురాలు కావడంతో నీరాజనాలు పడుతున్నారు

కుటుంబ సభ్యురాలిగా ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తున్నారు

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంభందించి 15వ డివిజన్ లో జనసేనపార్టీ అభ్యర్ధిని పసుపులేటి రజని ప్రచారంలో ముందుకు దూసుకెళుతున్నారు. గడప గడపకూ వెళుతూ ఓట్లను అభ్యర్ధిస్తున్నారు. 15వ డివిజన్ లో అందరికీ సుపరిచితురాలు కావడంతో ప్రజలు ఆమెకు నీరాజనాలు పడుతున్నారు. జనసేనపార్టీ రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు సోదరే పసుపులేటి రజనీ. కొట్టే వెంకటేశ్వర్లు కూడా 15వ డివిజన్ ప్రజలతో పాటూ జిల్లా వాసులందరికీ సుపరిచితులే. ఆయనకు స్థానికంగా మంచి పట్టుంది. 2014లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కొట్టే వెంకటేశ్వర్లు తల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేయగా 800 పై చిలుకు ఓట్లు లభించాయి. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ మరుగున పడ్డ ఆరోజుల్లో 800 ఓట్లు రావడం చాలా గొప్ప విషయం. ఈ నేపద్యంలో తాజాగా అదే డివిజనులో సోదరి రజనీని ఎన్నికల బరిలో నిలబెట్టారు. సోదరి విజయం కోసం శ్రమిస్తున్నారు. డివిజన్ ప్రజలతో కొట్టే వెంకటేశ్వర్లుకు సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా ఆయన్ను అభిమానిస్తుంటారు. ఇవన్నీ సోదరి రజనీకి కలిసొచ్చే అంశాలు. ప్రచారంలో భాగంగా ప్రతీ ఇంటికి వెళుతున్న రజనీని కుటుంబ సభ్యురాలిగా ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తున్నారు. విజయంపట్ల ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని… తనను గెలిపిస్తే డివిజన్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు.