అనుంపల్లి గ్రామంలో జనసేన-టిడిపి ప్రచారం

కళ్యాణదుర్గం నియోజకవర్గం, జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతుగా శెట్టూరు మండలంలోని అనుంపల్లి గ్రామంలో అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి జనసేన-టిడిపి ఉమ్మడిగా గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. శెట్టూరు మండల టిడిపి కన్వీనర్ టి.ఆర్.తిప్పేస్వామి మరియు శెట్టూరు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు కాంత్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరఫున శెట్టూరు మండల ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్, ముఖ్య నాయకులు మల్లేష్, రవి, కళ్యాణ్, గణేష్, నరేష్, కార్యకర్తలు, వీరమహిళలు, పాల్గొన్నారు.