హాట్టా గూడా గ్రామంలో జనసేన బృందం పర్యటన..

హాట్టా గూడా గ్రామంలో పర్యటించిన జనసేన మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, రామకృష్ణ, రాజ్ భరత్ తదితరులు..

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం, అరకు మండల పరిధిలోగల మాడగడ పంచాయతీ, హాట్టా గూడా గ్రామంలో బుధవారం ఆ..యా.. గ్రామాలలో జనసేన బృందం పర్యటించారు. ముందుగా ఇంటింటికి జనసేన మాటలు సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. గ్రామంలో దీర్ఘకాలం నుంచి వ్యాధితో బాధపడుతున్న బాధితురాలు అప్పలమ్మ ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం గ్రామాల్లో ఉన్న పాఠశాలలను సందర్శించి విద్యార్థినీ విద్యార్థులతో సమావేశమై.. మీరందరూ బాగా చదువుకొని ఉన్నతస్థాయిలో ఎదిగేలా ఇప్పటినుండి బాగా చదువుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు గతం లక్ష్మణరావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.