డెంకాడ మండలంలో గడపగడపకు జనసేన

నెల్లిమర్ల నియోజకవర్గం: గడపగడపకు జనసేన కార్యక్రమంలో భాగంగా డెంకాడ మండలంలోని, అమకం, వెంకన్నపేట గ్రామాలలో సోమవారం శ్రీమతి లోకం మాధవి పర్యటించారు. గడపగడపకి తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ, వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకి తమ ఓటు వేసి జనసేన పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరారు. వాటిలో ముఖ్యంగా నాలుగు ఏళ్లు గడుస్తున్నా ఇంటి బిల్లులు మంజూరు అవ్వకపోవడం, అలాగే నీటి సమస్య, సరైనటువంటి రోడ్లు కానీ కాలువలు కానీ లేకపోవడం వంటి సమస్యలు గ్రామస్తులు మాధవి దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమకి అధికారం కట్టబెడితే, ప్రతి ఇంటికి త్రాగునీటి సమస్య లేకుండా చూస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తాను మాట ఇచ్చి మోసం చేసే నాయకురాలను కాదు అని, ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడతానని తెలిపారు. అలాగే అర్హులైన వారికి ప్రభుత్వం నుండి సహాయం అందడం లేదని తెలుసుకున్న మాధవి ఆ బాధితులతో కలసి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేసి వారికి న్యాయం జరిగేలా చూస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పైల శంకర్, కోరాడ అప్పారావు, కోన శివ, అప్పలరాజు, రమేష్ ఇద్దుపల్లి, సూరిబాబు పొన్నాడ, రాజు చుక్క, రాజు దుర్గాసి, రవీంద్ర మాకిన, రవి పిళ్ళ, రమేష్ గుడేల, నవీన్ గుడెల, రామారావు బుత్తల, శివ దిండి మరియు జనసైనుకులు పాల్గొన్నారు.