వి.ఆర్.పురంలో ప్రజల్లోకి జనసేన

రంపచోడవరం, జనసేన పార్టీ వి.ఆర్.పురం మండల ఉపాధ్యక్షులు కనుగుల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ప్రజల్లోకి జనసేన కార్యక్రమాన్ని జీడిగుప్ప మరియు కల్తునూరు గ్రామాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి జనసేన నాయకులతో మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ కలిసి కల్తునూరు, జీడిగుప్ప, రాయిగుడెం,ఇసునూరు గ్రామాలలో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ముందుగా చెల్లించిన ఆర్&ఆర్ ప్యాకేజీ విషయంలో చాలా మందికి అన్యాయం జరిగిందని,రావాల్సిన డబ్బులు ఇచ్చేసి ఇళ్లపట్టలు ఇచ్చేస్తే వెళ్ళిపోతామని వాపోయారు. ఎన్ని దరఖాస్తులు చేసినా, ఎమ్మెల్యే దృష్టికి ఎన్నిసార్లు వెళ్ళినా న్యాయం జరగలేదని వాపోయారు. మా గ్రామాలలో అభివృద్ధి శూన్యమని, ఆర్&ఆర్ కాలనీ పరిస్థితి కూడా అంతంత మాత్రం గానే ఉందని మౌలిక సదుపాయాలు ఏమి లేవని ముందు చూస్తే గొయ్యి వెనుక చూస్తే నుయ్యిలా మా పరిస్థితి ఉందని జనసేన నాయకులకు వివరించారు. కల్తునూరుకు రేషన్ సమస్య పీడిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే రూపాయి బియ్యం తెచ్చుకోవడానికి జీడిగుప్ప నుంచి నాటు పడవల మీద తెచ్చుకోవాల్సి వస్తుందని 200 నుంచి 300 రూపాయలు ఖర్చు అవుతుందని మోయలేని భారంగా ఉందని వాపోయారు. నాయకులు సాయికృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు అబివృద్దికి ఆమడ దూరంలో ఉన్నారని గోదావరి వరదలకు నరకం అనుభవిస్తున్నారని పోలవరం ప్రాజెక్ట్ మండల ప్రజలకు శాపంగా మారిందని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, రేషన్ బియ్యం ఇతర నిత్యావసర సామగ్రి ట్రాక్టర్ పై పంపించే విధంగా ప్రతిపాదన పెడతామని హామీ ఇవ్వడం జరిగింది. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరగాలంటే జనసేన కూటమి అధికారంలోకి రావాలని, వచ్చే మన ప్రభుత్వమే నిర్వాసితులకు న్యాయం చేస్తుందని నాయకులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోమండల కార్యదర్శి కెచ్ఛల పోషి రెడ్డి, నాయకులు కోట్ల రాజిరెడ్డి, మండల యూత్ నాయకులు పెడపెట్ల పవన్ కళ్యాణ్, అందెల కృష్ణారెడ్డి, కదల గణేష్ రెడ్డి, అందెల కన్నపరెడ్డి, కనుగుల వెంకటరెడ్డి, వల్ల రవీంధర్ రెడ్డి, కనుగుల సత్యనారాయణ రెడ్డి, కనుగుల సుధాకర్ రెడ్డి, వాళ్ళ బూసు రెడ్డి, వల్ల సాగర్ రెడ్డి, కధల శ్రీనివాస్ రెడ్డి కోండ్ల వినోద్ కుమార్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.