Guntur: సరికొత్త రాజకీయ వ్యవస్థ నిర్మాణ దిశగా జనసేన – ఆళ్ళ హరి

జనసేన అర్బన్ జిల్లా నాయకులు ఆళ్ళ హరి.

గుంటూరు అర్బన్, ఇద్దరు శాసనసభ్యులు ఒక మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్లు పద్దెనిమిది మంది కార్పొరేటర్ల నిరంతర పర్యవేక్షణ, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ వీటికి తోడు అడుగడుగునా అధికార దుర్వినియోగం చేసినా తమ అసమర్ధ, అరాచక పాలనపై ప్రజల్లో పెల్లుబికుతున్న వ్యతిరేకతతో ఓటమి నుంచి వైసీపీ బయటపడలేకపోయిందని, ఈ ఓటమితో వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని జనసేన పార్టీ అర్బన్ జిల్లా నాయకులు ఆళ్ళ హరి అన్నారు. 6వ వార్డు నుంచి జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన భార్గవ్ రామ్ తో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నేతల అహంకార పూరిత, నిరంకుశపాలన పట్ల ప్రజలు రెండున్నరేళ్లకే విసిగిపోయారని విమర్శించారు. తాము ఏదిచేసినా ప్రజలు సహిస్తారని, డబ్బులు ఇస్తే వాళ్లే ఓట్లు వేస్తారంటూ భావించిన వైసీపీ నేతలకు ప్రజలు తిరిగి లేవలేని స్థాయిలో బుద్ధి చెప్పారన్నారు. డబ్బు, మద్యం, కులమతాల రొచ్చు లేని స్వచ్ఛమైన సరికొత్త రాజకీయ వ్యవస్థ నిర్మాణ దిశగా జనసేన పయనిస్తోందని జనసేనకు పడ్డ ప్రతీ ఓటు మార్పుకి శ్రీకారం చుడుతుందన్నారు. గెలుపోటములకు అతీతంగా జనసేన ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీచేసిన భార్గవ్ రామ్ మాట్లాడుతూ ప్రజలతో మరింతగా మమేకం అవుతూ జనసేన బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని, తమకు ఓటు వేసిన ప్రతీ ఒక్కరికీ, తన వెంట నడిచిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియచేసారు. సమావేశంలో యర్రంశెట్టి పూర్ణ, పమిడి పవన్, గాదె లక్ష్మణరావు, లక్ష్మిశెట్టి నాని, వినయ్, మామిడాల రాజేష్, నున్నా రవి తదితరులు పాల్గొన్నారు.