నల్లల రామకృష్ణపై దాడి చాలా దారుణం

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల ఉపాధ్యక్షులు సుంకర దుర్గ చక్ర (చక్రి) పేర్కొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండపంలో వారి స్వగృహంలో పత్రికా ప్రకటన విడుదల చేసారు. నల్లల రామకృష్ణ అనే వ్యక్తి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న మనిషి, పార్టీకి అవసరమైన వ్యక్తి ఆయన మీద దాడి జరగడం చాలా దుర్మార్గమని అన్నారు. సెప్టెంబర్ 9 వ తారీఖున నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు కొన్ని గ్రామాల్లో ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమం చేపట్టారు, అదే రోజున ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం. ఇది ఎవరో కావాలని చేశారు. 9 వ తారీఖున నియోజకవర్గంలో ఉదయాన్నే బ్యాచ్ ని సిద్ధం చేసుకుని సాయంకాలం నల్లలని బయటకి రప్పించి మర్డర్ ప్లాన్ చేసాడు. పాపం ఆయన ఎవరికి శత్రువు కాదు, ఏదో రాజకీయాల్లో ముక్కుసూటిగా మాట్లాడటమే ఆయనకి శాపంగా మారింది. నల్లలకి జనసేన పార్టీ అండగా ఉంటుంది. రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. నల్లల రామకృష్ణ మీద కొందరు చేయి చేసుకోవడం చాల బాధాకరం. రామకృష్ణ శరీరం లోపల దెబ్బలు బాగా తగిలాయని, నొప్పులు భరించలేక హాస్పిటల్ లో చేరడం జరిగిందని తెలిపారు. ఆయన ఎవరికి శత్రువు కాదు, ఏదో రాజకీయాల్లో ముక్కుసూటిగా మాట్లాడటమే ఆయనకి శాపంగా మారిందని, రామకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని చక్రి తెలిపారు.