రహదారి మరమత్తులు చేపట్టిన జనసేన

కడపజిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి మండలం సానిపాయి గ్రామపంచాయతీ వెల్లూరువాండ్లపల్లికి జనసేన అద్వర్యం అలానే శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రహదారి నిర్మాణ మరమ్మతులు చేపట్టి పూర్తి చేయటం జరిగింది. అలానే జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వాలు పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో రామశ్రీనివాసులుతో పాటు పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి, పార్లమెంట్ ఇంచార్జ్ ముకరం ఛాన్, జనసేన రాష్ట్ర చేనేత కార్మిక విభాగ కార్యదర్శి రామయ్య, జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బారాయుడు, పార్టీ ముఖ్య మరియు ఇతర మండలాల నాయకులు, జనసైనికులు, వీరమహిళ రెడ్డిరాణి, గ్రామస్తులు మరియు అదే గ్రామానికి చెందిన జనసేన నాయకులు, గుగ్గిళ్ళ నాగార్జున, జనసేన వార్డు మెంబర్ గుగ్గిళ్ళ వెంకటేష్ పాల్గొన్నారు.