Palnadu: “జీరో బడ్జెట్ పాలిటిక్స్”తో గురజాలలో ఎగిరిన జనసేన జెండా

గుంటూరు జిల్లా, పల్నాడులో అధికార పార్టీ ఒత్తిడిని తట్టుకొని ఒక సామాన్య దళిత కుర్రాడు గురజాల మున్సిపల్ ఎన్నికల్లో వార్డు మెంబర్ గా 132 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన చింతకాయల కళ్యాణ్.

గుంటూరు జిల్లా, గురజాల నగర పంచాయితీ 18వ వార్డులో జనసేన అభ్యర్ధి చింతకాయల కళ్యాణ్ (SC) 183 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ వార్డులో జనసేనపార్టీ అభ్యర్ధిని ప్రచారం చేసుకోనీయకుండా కిడ్నాప్ చేసినా గానీ పార్టీ తరఫున స్థానిక జనసేన నాయకులు, జిల్లా పార్టీ కార్యదర్శి, న్యాయవాది శ్రీ బడిదల శ్రీనివాసరావు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గెలిపించారు. సత్తెనపల్లి నుండి, గుంటూరు నుండి కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు గురజాలకి, దాచేపల్లికి వచ్చి ప్రచారం చేశారు. రాష్ట్రం మార్పు దిశగా ప్రయాణిస్తుంది. జనసైనికుల భాద్యత మరింత పెరిగింది

డబ్బు ఖర్చులేని రాజకీయంతో ఇలాంటి నవ యువ నాయకులు పోరాడి గెలిచిన విజయాలు చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తోందని జనసేన శ్రేణులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.