ఫుడ్ మరియు క్యాటరింగ్ కమిటీ సభ్యులను కలసిన జనసేనాని

మంగళగిరి: వారాహి విజయాత్ర మొదట విడతలో భాగంగా ఫుడ్ మరియు క్యాటరింగ్ కమిటీలో సభ్యులుగా బాధ్యతలు వహించిన సభ్యులందరినీ పవన్ కళ్యాణ్ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. వారితో పాటు పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ వారితో అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి వారాహి యాత్రను విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లే బాధ్యత మీ భుజాలపై ఉందని, మీ మీద నమ్మకంతోనే ఈ బాధ్యతలు అప్పచెప్పానని వారిని ప్రశంసించారు. కమిటీ సభ్యులు అధినేతతో మాట్లాడుతూ చాలా నిబద్ధతతో పనిచేస్తామని, వారాహి విజయ యాత్ర విజయవంతం అవుతుందని తెలిపారు.