చట్టానికి, న్యాయానికి వ్యతిరేకంగా పని చేస్తున్న విజయవాడ నగర పోలీసులకు సెల్యూట్

• పశ్చిమాన జనసేనని ఎదుర్కోలేకే జనసేన నాయకులు మీద తప్పుడు కేసులు పెడుతున్న వైసిపి
• ఒక వైసీపీ నాయకుడు ఫిర్యాదు చేస్తే జనసేన నాయకులపై కేసులు నమోదు చేస్తారా
• పోలీస్ శాఖ వారు పనిచేస్తుంది చట్టానికి న్యాయానికి లోబడా లేక వైసీపీ నాయకుల ఆదేశానుసారమా విజయవాడ నగర ప్రజలకు సమాధానం చెప్పాలి
• వైసీపీ నాయకులపై కేసులు పెట్టలేదే ?

విజయవాడ, పశ్చిమ నియోజకవర్గం, టూ టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ 16 మంది కార్యకర్తలపై నమోదు చేసిన కేసులో రిమాండ్ ను తిరస్కరించి 41ఏ సిఆర్పిఎస్సి జారీ చేయాలని ఆదేశించిన విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు. కోర్టు నుంచి బయటికి వచ్చిన అనంతరం జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ పోతిన వెంకట మహేష్ విలేకరులతో మాట్లాడుతూ చట్టానికి, న్యాయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న విజయవాడ నగర పోలీసులకు సెల్యూట్ చేస్తున్నామని, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున జనసేన నాయకుల పై తప్పుడు కేసులు విజయవాడ పోలీసులు నమోదు చేశారని, ఏదో రకంగా జనసేన నాయకులను ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు పెడుతున్నారని, వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను తగలబెడితే ఆపలేని పోలీసులు జనసేన నేతలు ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెడితే తప్పుడు కేసులు పెట్టారని, చిన్న కేసులకు కూడా అరెస్ట్ లు చేశారని, ఎఫ్ఐఆర్లో ఒక ఏడాదికి మించి శిక్ష పడిని సెక్షన్లకు 41ఏ సిఆర్పిఎస్సి నోటీసులు జారీ చేయకుండా కావాలనే రిమాండ్ విధించాలని కోర్టు వారిని కోరారని ఇది ఎవరిని మెప్పించడానికి పోలీస్ వారు సమాధానం చెప్పాలని, దమ్ముంటే తోట సందీప్ మర్డర్ కేసులో, చెన్నుపాటి గాంధీ దాడి కేసు, అస్లాం మర్డర్ లాంటి క్రిమినల్ కేసులలో చర్యలపై విజయవాడ పోలీసులు దృష్టి పెట్టాలని, జనసేనని పశ్చిమాన ఎదుర్కోలేక వేలంల్లి శ్రీనివాసరావు ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని, రానున్న ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావుకి సీటే లేదని, ఒకవేళ సీటు ఇస్తే జనసేన పార్టీ తరఫున నేను భారీ మెజార్టీతో గెలుస్తానని, జనసేన నాయకులపై అక్రమ కేసులు పెడితే న్యాయపరంగా ఎదుర్కొంటామాని, పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ తగలబెట్టిన వైఎస్సార్సీపి నాయకులపై పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లేని పక్షంలో వారిపై ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసి న్యాయపోరాటం చేస్తామని, కోర్టు బోనులోకి వారిని లాగుతామన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని ఈ పోరాటం ఎంతవరకైనా ముందుకు తీసుకెళ్తామన్నారు. వేంపల్లి గౌరీ శంకర్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం ఎంతవరకైనా పోరాడుతామని మేము ప్రజల్లో ఉన్నవారమని అక్రమ అరెస్టులకు భయపడేది లేదని పవన్ కళ్యాణ్ చెప్పిన మార్గంలో ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని ఒక సాధారణ కేసులో తెల్లవారుజామున వచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందో పోలీసులు చెప్పాలని పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంది దొంగల్ని స్వేచ్ఛగా వదిలేసిన వారు ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం ఏ న్యాయము చెప్పాలన్నారు.
ఎఫ్ఐఆర్లో అరెస్టై విడుదలైన వారు కొరగంజి వెంకటరమణ, వేంపల్లి గౌరీ శంకర్, వేవిన నాగరాజు, అమీర్ బాషా, నాగోతి సాయి, దాసిన జగదీష్, గూడాల దుర్గారావు, రాళ్లపూడి గోవిందరావు, పవన్ కళ్యాణ్ ఎన్, ఇజాజ్ షైక్, శ్రీను చెవుల, సోమి మహేష్, రాము పొట్నూరి, శంకర్ పిల్ల, తమ్మిన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.