చొప్పదండిలో జనసేనాని జన్మదిన వేడుకలు

చొప్పదండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని ఓద్యారం గ్రామంలో జనసేనాని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శివారెడ్డి చల్లా హాజరై కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు తడికపెల్లి అరవింద్, నియోజకవర్గ నాయకులు, ప్రశాంత్, రంజిత్, హరీశ్, శివ, దర్శన్, మహేశ్ గంగరాజు, సాయికిరణ్ అక్షయ్, కార్తిక్, శివరాం, ఆదిత్య, చరణ్, తదితర జనసెన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.