కోవూరులో జనసేనాని జన్మదిన వేడుకలు

కోవూరు, భవన నిర్మాణ కార్మికులతో జనసేనాని జన్మదిన సందర్భంగా అల్పాహారం విందు చేసిన జిల్లా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్. కోవూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం జనసేన పార్టీ పీఏసీ మెంబర్ నాదెండ్ల మనోహర్ పిలుపుతో పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు చేయాలని పిలుపుతో అల్పాహారం విందు చేసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న గునుకుల కిషోర్. జగన్ ప్రభుత్వం మొదటిగా అధికారంలోకి రాగానే కడుపు కొట్టింది భవన నిర్మాణ కార్మికులదే. ఇసుక దోపిడీ చేసి సామాన్యంగా సామాన్యుడికి అందనంత రేటు పెంచేసి మధ్య తరగతి వారు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరక కుండా చేసారు ఈ వైసిపి ప్రభుత్వం. రోజు ఇక్కడ గిరిజా హాల్ సెంటర్లో దాదాపుగా 200 మంది కూలీలు పని కోసం వచ్చి వాటిలో 20 లేదా 30 మందికి కూడా పని దొరకని పరిస్థితి. 10 గంటల అయ్యే వరకు వేచి ఇక మిగిలిన వారందరికీ కడుపు మాడే పరిస్థితి. వీరికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు కావాలంటే పెత్తందారులకు 800 రూపాయలు ముట్ట చెప్పాల్సిందే 800 రూపాయలు అంటే రెండు రోజులు కూలి అని వెనకాడుతున్నారు. వారికి ప్రభుత్వం తరఫున వారికి అందాల్సిన పథకాలు ఏమీ అందడం లేదు. కరోనా సమయంలో కూడా వారికి జీవన బృతి లేక అల్లాడుతుంటే ఏదో తరిహరం ఇస్తానన్నారు. కానీ ఇప్పటిదాకా అదింది లేదు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే వీరందరికీ ఉచితంగా గుర్తింపు కార్డులు ఇస్తాం. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఖచ్చితంగా బాధితులకు భీమా అందేటట్లుత చేస్తాం. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎంతోమంది బాధలు పడుతున్నారు అని వాటిలో మొట్టమొదటి స్థానంలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఎవరికీ ఉపయోగపడని ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిందే. ప్రజలకు సేవ చేసేందుకు విలాసవంతమైన జీవితాన్ని వదిలి వచ్చిన పవన్ కళ్యాణ్ ని గెలిపించి ప్రజా ప్రభుత్వం జనసేనకు అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది.