పామూరులో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

పామూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు దర్శి ఏడుకొండల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పామూరులోని పద్మావతి అతిధి గృహం నందు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు అనంతరం పామూరు చిల్డ్రన్ హోమ్ నందు అనాధలకు మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం నిర్వహించి తదుపరి పిల్లలకు అవసరమైన బుక్స్ మరియు పెన్సిల్ పెన్నులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పామూరు మండల అధ్యక్షుడు దర్శి ఏడుకొండలు, గోస్ట్ సునీలు మరియు పసుపులేటి ప్రసాదు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు సందాని, శ్రీహరి పగడాల మల్లికార్జున, నాని నాయుడు డేగ సూర్యనారాయణ, రాహులు వాసు, శివ, మహేష్, దిండు సత్యనారాయణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.