రాజంపేటలో అంగరంగ వైభవంగా జనసేనాని జన్మదిన వేడుకలు

అన్నమయ్య జిల్లా, రాజంపేట మన్నూరులోని, జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మన్నూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ముందుగా స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీనివాసరాజు జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి తర్వాత రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పెద్ద యెత్తున జనసైనికులు, యువకులు, వీర మహిళలు పాల్గొని రక్తాన్ని దానం చేశారు. జనసైనికులకు గాజు గ్లాసు గుర్తుతో ఉన్న టీషర్ట్ లను పంపిణీ చేశారు. అనంతరం 1500 మందికి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నా సేన కోసం నా వంతు ఒక రోజు వేతనం పార్టీకి విరాళంగా ప్రకటించి పార్టీ బలోపేతం కోసం ఉపయోగపడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం భవన నిర్మాణ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేసి, వికలాంగులకు నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ పార్టీ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్క జన సైనికుడు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉపాధి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో సైకో ప్రజాప్రతినిధులు పంచభూతాలను సర్వనాశనం చేస్తూ మైన్, వైన్ కాదేదీ దోచుకోవడం అనర్హం అన్నట్లు కేవలం వారి వ్యక్తిగత సంపాదన ధ్యేయంగా పరిపాల కొనసాగిస్తున్నారే తప్ప ప్రజల కోసం ప్రజల కొరకు వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని వారు ఎద్దేవా చేశారు కావున రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే పవన్ బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. గత పది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతూ పార్టీని నడిపిస్తున్నారు. మనం కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు, ఆరు మండలాలు జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.