చెరువుల కబ్జాలపై సమాచారం కోసం జనసేన వినతిపత్రం

బొబ్బిలి నియోజకవర్గంలో కోటి చెరువు మొదలు ఇలా బంధలు చెరువులను అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేస్తున్నారని తెలిసి పూర్తి సమాచారం కోసం బొబ్బిలి ఎంఆర్ఓ కి సమాచార హక్కు చట్టం ఆర్.టి.ఐ కింద సమాచారం కోసం జనసేన తరఫున జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్ వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో చీమల సతీష్, సత్య, కిరణ్, రాజేష్, గణేష్, పోతల శివశంకర్, రమేష్, జగన్, శివ, సంతోష్ జనసేన నాయకులు, వీరమహిళలు దివ్య, రమ్య పాల్గొన్నారు. అలాగే బొబ్బిలి నియోజకవర్గంలో కబ్జాలకు గురి అవుతున్న చెరువులు, ప్రభుత్వ స్థలాలు మీద జనసేన పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, చెరువుల మీద సమగ్ర విచారణ జరిపి పవన్ కళ్యాణ్ గారికి ఒక డాక్యుమెంటరీ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా జనసేన నాయకులు తెలిపారు.