కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్

  • ఏ అండా లేకుండా ఒక వ్యక్తి తలుసుకుంటే ఏదైనా సాధించొచ్చు అనేదానికి గొప్ప ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి
  • నేటి యువత అదే బాటలో నడవాలని పిలుపునిచ్చిన నాయిని సతీష్

కంచికచర్ల పట్టణంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు నాయిని సతీష్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియ శెట్టి శ్రీకాంత్ కార్యక్రమానికి హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన కేక్ కట్ చేసిన అనంతరం కుర్రకారులు కేరింతల నడుమ బాణాచంచాల హోరులో మెగాస్టార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా సినీవినీల ఆకాశంలో దశ దిశ నీ నిర్ణయించి, ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు కష్టపడి తత్వం, నిత్య విద్యార్థి, సాధించాలని తపన ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని తెలియజేసిన ఏకైక నటుడు, మహా మహులను తట్టుకొని నిలబడ్డ ఘనుడు, నేటి యువతకు ఎంతోమందికి ఆదర్శవంతమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మెగాస్టార్ చిరంజీవి ఎదుర్కొన్న ఆటుపోట్లను వివరించారు. ఈ కార్యక్రమం లో దేవిరెడ్డి శ్రీనివాసరావు, తోట ఓంకార్, దేవిరెడ్డి అజయ్ బాబు, పుప్పాల వేణుగోపాల్, పెద్దినేడి హరి బాబు, కుసునూరు నరసింహ రావు, కోటారు దేవేంద్ర, వనపర్తి పద్మారావు, చిన్నం శెట్టి బాలాజీ, కనపర్తి సాయివెంకట సూర్య తేజ, గోపి, పసుపులేటి శ్రీనివాసరావు, పురమ ప్రసాద్, కుర్రా నాని, మరియు వీరమహిళలు కంభంపాటి రమాదేవి, తాటి విజయ, గోపిశెట్టి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.