అప్రోచ్ రోడ్డు నిర్మాణ లోపంపై స్పందనలో జనసేన వినతి

పెద్దాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో
సామర్లకోట మండలం, గొంచాల మరియు అచ్చంపేట గ్రామం మధ్య కొత్తగా నిర్మించిన హైవే అప్రోచ్ రోడ్డు పూర్తి ప్రాతిపదికగా నిర్మించకపోవడం వల్ల మండలంలోని ఉన్న అనేక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడడం,
అంతేగాక అక్కడ అత్యంత ప్రమాదకరంగా ఆ ప్రాంతం మారి దాదాపు అయిదుగురు వరకు మరణించడం జరిగింది. దీనిపై వెంటనే స్పందించాలని సోమవారం జిల్లా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం ద్వారా ఈ సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లి వారం రోజుల్లో స్పందించకపోతే జనసేన పార్టీ తరఫున ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పిట్ట జానకి రామారావు, మండల ఉపాధ్యక్షులు గద్దనపల్లి సత్య లింగం, నవర జనసేన పార్టీ అధ్యక్షులు సిద్దు వెంకట కృష్ణ భవనారాయణ, సామర్లకోట పట్టణ అధ్యక్షులు సరోజ వాస్, మండల యువత అధ్యక్షులు మల్రెడ్డి బుచ్చిరాజు, గొంచలా గ్రామ జనసేన అభ్యర్థి సామన గణేష్, జనసేన పార్టీ మండల కార్యదర్శి పోతుల కాశి రామకృష్ణ,
చంద్రంపాలెం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు వాసు పాల్గొన్నారు.