సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో జరిగిన సమ్మెకు జనసేన సంఘీభావం

ఏలూరు, సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు సోమవారం ఏలూరులోని మున్సిపల్ ఆఫీస్ వద్ద సమ్మెను నిర్వహించారు. ఈ సమ్మెకు జనసేన పార్టీ తరపున పూర్తిగా సంఘీభావం తెలిపిన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.

కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బందులందరిని పర్మినెంట్ చేయాలి.
పిఆర్సి ప్రకారం కనీస వేతనం రూ.20 వేలు కరువు భవితవ్యం డిఏ ఇవ్వాలి.
4 సంవత్సరాల బకాయిలు, చెప్పులు, యూనిఫాం, సబ్బులు, కొబ్బరినూనె ఇవ్వాలి.
సిపిఎస్ విధానం రద్దు చేయాలి.
ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది కీ స్కిల్ట్, సెమీ స్కిల్ట్ వేతనాలు ఇవ్వాలి.
స్కూల్ స్వీపర్లకు కనీసం వేతనం ఇవ్వాలి.
ఇంజనీరింగ్ విభాగ సిబ్బందిని స్కూల్ స్వీపర్లను పర్మినెంట్ చేయాలి.
పనిభారం తగ్గించాలి. పనిచేయడానికి పనిముట్లు ఇవ్వాలి.
జనాభాను బట్టి సిబ్బంది సంఖ్యను పెంచాలి.
అలాగే 6 నెలల పెండింగ్ హెల్త్ అలవెన్సులు బకాయిలు చెల్లించాలి.
కార్మికుల జీతాలలో మినహాయించిన పిఎఫ్, ఈఎసెఫ్ సొమ్ము ఖాతాల్లో జమ చేయాలి అని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.