సామాన్యుడి గళం వినిపించడమే జనవాణి లక్ష్యం

* ఉభయ గోదావరి జిల్లాల నుంచి 497 అర్జీలు వచ్చాయి
* రేపటి నుంచి అర్జీల పరిష్కార ప్రక్రియ ప్రారంభమవుతుంది
* భీమవరం మీడియా సమావేశంలో పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో జనసేన పార్టీ “జనవాణి -జనసేన భరోసా” కార్యక్రమం చేపట్టిందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. సామాన్యుడు గళం వినిపించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని తెలిపారు. ఈ రోజు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి 497 అర్జీలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారని తెలిపారు. ఆదివారం భీమవరంలో జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10గం. నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పిఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు పాల్గొన్నారు. అర్జీల స్వీకరణ అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జనవాణి కార్యక్రమానికి సామాన్య ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. విజయవాడలో జరిగిన రెండు విడతల్లో దాదాపు 1000 అర్జీలు రావడం జరిగింది. ఈ రోజు భీమవరంలో 497 అర్జీలు వచ్చాయి. పంచాయతీ రాజ్, ఆరోగ్య, వ్యవసాయ, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖల నుంచి ఎక్కువ అర్జీలు వచ్చాయి. ముఖ్యంగా భీమవరం పట్టణంలో నెలకొన్న స్థానిక సమస్యలు, డంప్ యార్డ్ గురించి స్థానిక ప్రజలు అర్జీలు ఇచ్చారు. ఈ రోజు తీసుకున్న అర్జీల పరిష్కార ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుంది. వచ్చిన అర్జీలను సంబంధిత ప్రభుత్వ శాఖాధిపతులకు పంపిస్తాము. వాటితో పాటు జనసేన పార్టీ తరఫున లెటర్స్ రాస్తాము. వారం రోజుల తరువాత అర్జీకి సంబంధించిన అప్ డేట్ ను సంబంధిత వ్యక్తికి మెయిల్, వాట్సప్ ద్వారా అందిస్తాము. వాతావరణం పరిస్థితులు అనుకూలించకపోయినా ఏజెన్సీ ప్రాంతాల నుంచి సైతం చాలా మంది తరలివచ్చి అర్జీలు ఇచ్చారు. వారి నమ్మకాన్ని జనసేన పార్టీ తప్పక నిలబెట్టుకుంటుంది. వైసీపీ నాయకుల అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. వాటిపై కూడా పిటీషన్లు వచ్చాయి. దీనిపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు. జనవాణి కార్యక్రమం విజయవంతం అవ్వడానికి పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు చాలా కష్టపడ్డారు. వారందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు చేగొండి సూర్య ప్రకాశ్, కనకరాజు సూరి, ముత్తా శశిధర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి, జనసేన నాయకులు డి.వరప్రసాద్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం, లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్, కార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్, పార్టీ నేతలు రెడ్డి అప్పలనాయుడు, విడివాడ రామచంద్రరావు, శ్రీమతి ఘంటశాల వెంకటలక్ష్మి, మేకా ఈశ్వరయ్య, చిర్రి బాలరాజు, శ్రీ కరాటం సాయి, చన్నమల్ల చంద్రశేఖర్, ఇళ్ళ శ్రీనివాస్, యిర్రింకి సూర్యారావు, బన్ని వాసు, ధర్మరాజు, మల్నీడి బాబీ, శ్రీమతి కాట్నం విశాలి, శ్రీమతి కడలి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.