జనసేన పార్టీలో చేరిన జంగాలపల్లి శ్రీనివాసులు

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పవన్ కళ్యాణ్ సమక్షంలో చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు వై సీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తిరుపతి లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే జంగాలపల్లి శ్రీనివాసులు గారిని మేము మెజారిటీ తో గెలిపించుకుంటాము, రాయలసీమలో జెఎంసి శ్రీనివాసులు గారిని ఒక బలమైన నాయకుడిగా చేస్తామని మరియు తిరుపతి ప్రజలు మాకు ఆయన వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నారని రమేష్ బాబు మారసాని జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జనసేన పార్టీ రాయలసీమ జోన్ కమిటీ సభ్యులు తెలిపారు. వీరంతా శుక్రవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో జంగాలపల్లి శ్రీనివాసులు ని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.