తిరుమల వెంకటేశ్వరుని సన్నిధి లో జాతిరత్నాలు

లాక్‌డౌన్ తర్వాత థియేటర్స్‌లో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రాలలో జాతిరత్నాలు మూవీ ఒకటి. నవీన్‌పొలిశెట్టి-ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా అనుదీప్ కేవీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఫన్ ఎంటర్‌టైనర్ రీసెంట్‌గా విడుదల కాగా, ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి కావలసినంత వినోదాన్ని అందించింది. ఈ సినిమా విజయాన్ని చూసి చిత్ర హీరో నవీన్ పొలిశెట్టి ఎమోషనల్ అయి కంట కన్నీరు కూడా పెట్టుకున్నారు.

జాతి రత్నాలు టీం ఇంత మంచి విజయం సాధించిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకునేందుకు కాలినడకన కొండకు చేరుకున్నారు జాతిరత్నాలు టీం. ఈ రోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో వారు స్వామి వారిని దర్శించుకున్నారు. నవీన్ పోలిశెట్టి ..కుర్తా, దోతి ధరించి సంప్రదాయబద్ధమైన లుక్‌లో కనిపిస్తున్నాడు.