హామీలు నిలబెట్టుకునేలా బడ్జెట్‌: మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌: ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేలా బడ్జెట్ రూపకల్పన చేశామని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కాసేపట్లో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్‌రావు జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్‌ ఉంటుందని స్పష్టం చేశారు.